PDPL: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా బుకింగ్ యాప్ రైతులకు ఎంతో ఉపయోగకరంగా మారిందని జేడీఏ వై. సుచరిత తెలిపారు. సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి సహకార సంఘంలో ఆమె ఆకస్మిక తనిఖీ చేసి పైలట్ ప్రాజెక్టు అమలును పరిశీలించారు. యాప్ ద్వారా యూరియా లభ్యత స్పష్టంగా తెలిసి, ముందుగానే బుక్ చేసుకోవడంతో సమయం ఆదా అవుతోందన్నారు.