GDWL: ఎర్రవల్లి మండల కేంద్రం నుంచి షేకుపల్లి, సాసనూలు, దువాసిపల్లికి వెళ్లే రోడ్డులో గురువారం ట్రాఫిక్ సమస్య తలెత్తింది. నూతన సంవత్సరం–2026 సందర్భంగా ప్రజలు భారీగా రావడంతో అరకిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని స్థానికులు తెలిపారు. దుకాణాల ముందు వాహనాల పార్కింగ్తో సమస్య మరింత పెరిగిందన్నారు.