ASR: హుకుంపేట బాలికల వసతి గృహం ముందు రహదారి పక్కన వ్యర్థాలు పేరుకుపోయాయి. కుక్కలు, పందులు చెత్తను రోడ్డుపైకి లాగుతుండటంతో వాహనదారులు జారిపడుతున్నారు. దుర్వాసన, అపరిశుభ్రతతో విద్యార్థినులు, స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున పంచాయతీ అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.