E.G: కడియం(మం) కడియపులంకలోని నర్సరీలలో నూతన సంవత్సర వేడుకలు కన్నుల పండుగగా ప్రారంభమయ్యాయి. 45 వేల మొక్కలతో తీర్చిదిద్దిన ‘2026’ ఆకృతి సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. నర్సరీ అధినేత ఆంజనేయులు, ఆయన కుమారులు వారం రోజులు శ్రమించి ఈ సుందర దృశ్యాన్ని ఆవిష్కరించారు. జనవరి చివరి వరకు ఈ మొక్కల కూర్పు అందుబాటులో ఉంటుందన్నారు.