AP: న్యూఇయర్ వేళ రాష్ట్రంలో మద్యం అమ్మకాలు భారీగా నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా హోటల్స్, పబ్బులు, రిసార్ట్స్ కేంద్రంగా మద్యం విక్రయాలు జోరుగా సాగాయి. నిన్న ఒక్కరోజే సుమారు రూ.200కోట్ల మేర లిక్కర్ సేల్స్ జరిగినట్లు ఎక్సైజ్ శాఖ వర్గాల సమాచారం. గత సంవత్సరాలతో పోలిస్తే ఈసారి విక్రయాలు మరింత పెరిగినట్లు తెలుస్తోంది.