E.G: నూతన ఆంగ్ల సంవత్సరాది పురస్కరించుకుని గురువారం అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని రంగంపేటకు చెందిన పలువురు కూటమి నేతలు కలిశారు. ఎమ్మెల్యేకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి, రంగంపేట మండల అభివృద్ధికి ఆయన చూపిస్తున్న చొరవకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా కొత్త ఏడాదిలో ప్రజలందరికీ శ్రేయస్సు కలగాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.