ATP: ఉరవకొండలోని టీడీపీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఈ సంబరాల్లో పాల్గొని భారీ కేక్ కట్ చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు మంత్రికి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరి జీవితాల్లో నూతన ఏడాది వెలుగులు నింపాలని ఆయన ఆకాంక్షించారు.