ADB: ఆదిలాబాద్ పట్టణంలోని భుక్తాపూర్ ప్రజ్ఞ బుద్ధ విహార్లో గురువారం శౌర్య దినోత్సవాన్ని దళితులు, బౌద్దులు కలిసి ఘనంగా జరుపుకున్నారు. పేష్వా, మహార్ సమాజానికి చెందిన పోరాటయోధుల మధ్య జరిగిన యుద్ధంలో అమరులైన 500 మంది దళితులకు శ్రద్ధాంజలి ఘటించారు. భీమా కోరేగావ్ స్థూపానికి నివాళుర్పించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, పెద్దలు, చిన్నారులు, తదితరులు పాల్గొన్నారు.