AP: శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో కింజరాపు అప్పన్నను కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. ఈ రోజు ఉదయం ఇంట్లో ఉన్న అప్పన్నను ఇద్దరు దుండగులు బైక్‌పై తీసుకెళ్లారని ఆయన భార్య చెబుతున్నారు. MLC దువ్వాడ శ్రీనివాస్‌పై దాడి జరగబోతోందని దివ్వెల మాధురికి ఇటీవల అప్పన్న చెప్పారు. దీనికి సంబంధించి ఓ ఆడియో వైరల్ అయింది. ఈ నేపథ్యంలో అప్పన్నఅదృశ్యం కావడం చర్చనీయాంశమైంది.