NZB: ఈ యాసంగిలో రాష్ట్రంలో అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలోనే వరి నాటు వేశారు. జిల్లా మొత్తం 1.67 లక్షల ఎకరాల్లో వరి నాటినట్లు అధికార లెక్కలు చెబుతున్నాయి. మొక్కజొన్న, పసుపు, సోయా, పత్తి, కూరగాయలు అన్ని రకాల పంటలు కలిపి మొత్తం 2.40 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. కామారెడ్డి జిల్లాలో 47,905 ఎకరాల్లో వరి నాటారు. పలుచోట్ల ఇంకా నాట్లు వేస్తున్నారు.