కారు కొనాలంటే ఆలోచనతోపాటు, ఆర్థికంగా సంసిద్ధతా ఉండాలి. కారు కొనేందుకు 20/4/10 సూత్రాన్ని అనుసరించాలి. అంటే కారు ఆన్ రోడ్ ధరలో కనీసం 20 శాతం నగదును మీరు సొంతంగా చెల్లించాలి. అంటే, కారు ధర రూ.10లక్షలైతే అందులో రూ.2లక్షలు డౌన్‌పేమెంట్‌గా కట్టాలి. కారు రుణం 4 ఏళ్లలోనే తీర్చేందుకు సిద్ధమవ్వాలి. నెలవారీ ఆదాయంలో కారు EMI 10 శాతానికి మించకూడదు.