HYD: జగద్గిరిగుట్టలో న్యూ ఇయర్ వేడుకల్లో బిర్యానీ తిని ఒకరు మృతి చెంది 16 మంది అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని పార్టీ చేసుకున్న ప్రదేశాన్ని పరిశీలించారు. స్థానికుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. కాగా, అస్వస్థతకు గురైన 16 మంది సూరారం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.