VZM: రహదారిపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రహదారి నిబంధనలు పాటించాలని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలను ప్రారంభించి, గోడ పత్రికలు, కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. రోడ్డు ప్రమాదాల్లో 90 శాతం వరకు నిబంధనలు పాటించకపోవడమే కారణమని తెలిపారు.