AP: 22A జాబితా నుంచి 5 రకాల భూములను తొలగించామని మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. ‘మిగిలిన 4 రకాల భూములపై త్వరలో నిర్ణయం తీసుకుంటాం. ప్రైవేట్ భూములను 22A నుంచి పూర్తిగా తొలగించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ప్రభుత్వం పేర్కొన్న 8 రకాల పత్రాల్లో ఏ ఒక్కటి ఉన్నా భూములను జాబితా నుంచి తొలగించాలి. భూయాజమానుల హక్కులు రక్షించడమే మా లక్ష్యం’ అని పేర్కొన్నారు.