ADB: ఆదిలాబాద్ పట్టణంలోని కలెక్టరేట్ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలను గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని పలువురు అధికారులు, నాయకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కలెక్టర్ రాజర్షిషాను మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కలెక్టర్ విజ్ఞప్తి మేరకు జిల్లా అధికార యంత్రాంగం పుస్తకాలు, దుప్పట్లను అందజేశారు.