కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో గురువారం లారీ అసోసియేషన్ కార్యాలయంలో రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ కంచె వేణు హాజరయ్యరు. ఆయన మాట్లాడుతూ.. రహదారి భద్రత, ట్రాఫిక్ నియమాలు ప్రతి ఒక్కరు తెలుసుకొని వాటిని ప్రతి వాహన దారుడు విధిగా పాటించినపుడే ప్రమాదాలను నివారించవచ్చునని తెలిపారు.