GNTR: తెనాలి మున్సిపల్ ఛైర్ పర్సన్ తాడిబోయిన రాధికను మున్సిపల్ కమిషనర్ జెఆర్ అప్పల నాయుడు గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. నూతన సంవత్సరం సందర్భంగా ఛైర్ పర్సన్ రాధికా రమేశ్ దంపతులకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త సంవత్సరంలో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. అందరి సహకారంతో పట్టణ అభివృద్ధికి కృషి చేస్తున్నామని కమిషనర్ తెలియజేశారు.