ADB: భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ను బోథ్ MLA అనిల్ జాదవ్ గురువారం హైదరాబాదులో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పూల బొకే అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు జిల్లాలోని తాజా రాజకీయాలు, పలు అంశాలపై చర్చించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.