MDK: నూతన సంవత్సరం సందర్భంగా జగదేవ్‌పూర్ బస్టాండ్ ప్రయాణికులతో కిక్కిరిసింది. సెలవు దినం కావడంతో పాఠశాలలు, కళాశాలలకు విరామం ఉండటంతో బస్టాండ్ మొత్తం జనంతో రద్దీగా మారింది. వివిధ ఆలయాలు, పర్యాటక ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయాణికులు భారీగా బస్టాండ్‌కు చేరుకున్నారు. అయితే ఏ బస్సు చూసినా ప్రయాణికులతో నిండిపోయి ఉండటంతో ఎక్కే పరిస్థితి లేకపోయిందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు.