NLG: నకిరేకల్‌లోని ఓ ఫంక్షన్ హాల్లో వేద గ్రీస్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. నిర్వాహకులు ఎఫ్రాత కేక్ కట్ చేసి హాజరైన క్రైస్తవ సోదర, సోదరీమణులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి దైద రవీందర్ హాజరై మాట్లాడారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త సంవత్సర వెలుగులు నింపాలని ఆకాంక్షించారు.