KMM: మధిర టీజీఎస్ఆర్టీసీ డిపో మేనేజర్ డి.శంకరరావు బదిలీ అయ్యారు. గురువారం డిపోలో ఆయనకు వీడ్కోలు పలికారు. ఐఎన్టీయూసీ నాయకులు ఆయన్ను సత్కరించారు. మధిర డిపో ఐఎన్టీయూసీ గౌరవాధ్యక్షుడు కోరంపల్లి చంటి, డిపో అధ్యక్షుడు ఎంఎన్ రావు, ఉపాధ్యక్షురాలు గుర్రం సుజాత, సెక్రటరీ పత్తేపరపు అనూష తదితరులు పాల్గొన్నారు.