ప్రముఖ హీరోయిన్ సంయుక్త మీనన్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘బ్లాక్ గోల్డ్’. హాస్య మూవీస్ బ్యానర్‌పై దర్శకుడు యోగి ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. న్యూ ఇయర్ సందర్భంగా మేకర్స్.. ఈ మూవీ స్పెషల్ పోస్టర్ షేర్ చేశారు. ‘హ్యాపీ న్యూ ఇయర్. బలం, స్థితిస్థాపకత, ధైర్యం వంటి అంశాలతో కూడిన శక్తివంతమైన కథ ఈ వేసవి 2026 థియేటర్లలో వేచి ఉంది’ అని పేర్కొన్నారు.