ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్లో జాతీయ రోడ్డు భద్రత మహోత్సవంలో భాగంగా కలెక్టర్ వెంకటేష్ దౌత్రే, ఎస్పీ నితికా పంత్, అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, అడిషనల్ కలెక్టర్ డేవిడ్ కలిసి గురువారం పోస్టర్ విడుదల చేశారు. రోడ్డు నియమాలను పాటిస్తూ రోడ్డు భద్రత సిబ్బందికి సహకరించాలని వాహనదారులకు వారు సూచించారు. ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలన్నారు.