కర్నూలు నగర ప్రజల సమస్యల పరిష్కారానికి శుక్రవారం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు ‘డయల్ యువర్ కమిషనర్’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కమిషనర్ పి.విశ్వనాథ్ గురువారం తెలిపారు. తాగునీరు, వీధిదీపాలు, పారిశుద్ధ్యం వంటి సమస్యలపై 08518-221847 నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.