MDK: నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో గురువారం సాధారణ ఎన్నికల ఓటర్ జాబితా డ్రాఫ్ట్ విడుదల చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పురపాలక సంఘం కార్యాలయంలో కమీషనర్ బండ శ్రీరామ్ చరణ్ రెడ్డి చేతుల మీదుగా మున్సిపాలిటీ పరిధిలోని 15 వార్డులకు సంబంధించిన ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేశారు. ప్రజలకు అందుబాటులో ఓటరు జాబితాను ప్రదర్శించారు.