ATP: జిల్లా వ్యాప్తంగా రహదారి భద్రతా మాస ఉత్సవాలను జయప్రదం చేయాలని కలెక్టర్ ఓ.ఆనంద్ పిలుపునిచ్చారు. గురువారం రెవెన్యూ భవన్లో రవాణా శాఖ ప్రచార సామాగ్రిని ఆవిష్కరించారు. వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపరాదని, సెల్ ఫోన్ వాడకం ప్రాణాంతకమని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.