AKP: జిల్లాలో రేపటి నుంచి 9వ తేదీ వరకు రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ విజయ కృష్ణన్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. రీసర్వే జరిగిన 373 గ్రామాల్లో గతంలో జారీ చేసిన 2,01,841 పట్టాదారు పాస్ పుస్తకాల స్థానంలో రాజు ముద్రతో కొత్తవి రైతులకు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. గతంలో ఇచ్చిన పాస్ పుస్తకాలను తిరిగి అప్పగించాలన్నారు.