E.G: రాజమండ్రి నగరపాలక సంస్థ కార్యాలయంలో గురువారం నూతన సంవత్సర వేడుకలు ఉత్సాహంగా నిర్వహించారు. అదనపు కమిషనర్ రామలింగేశ్వర్తో పాటు అధికారులు కమిషనర్ రాహుల్ మీనాకు శుభాకాంక్షలు తెలిపారు. సిబ్బంది బాధ్యతతో పనిచేసి ప్రభుత్వ పథకాల ఫలాలను ప్రతి గడపకు చేర్చాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆయన సూచించారు.