NDL: డోన్ ఎమ్మెల్యే జయసూర్య ప్రకాష్ రెడ్డి కుటుంబం ఆధ్వర్యంలో జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు టీడీపీ కార్యాలయంలో హనుమాన్ సుందరాకాండ పారాయణం నిర్వహించనున్నారు. ప్రతిరోజు సాయంత్రం ఈ కార్యక్రమం జరుగుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు. ముగింపు రోజైనా 8వ తేదీన శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా జరగనుంది. నియోజకవర్గ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.