MBNR: ప్రభుత్వం నుంచి మంజూరైన నిధులతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆదేశించారు. గురువారం దేవరకద్ర మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో ఆయన సమీక్షసమావేశం నిర్వహించారు. రూ.15కోట్ల నిధులతో చేపట్టిన డ్రైనేజీ, విద్యుత్, తాగునీరు, సీసీరోడ్లు తదితర అభివృద్ధిపనుల పురోగతిపై వివరాలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు.