కర్నూలు జిల్లాలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మద్యం విక్రయాలు రికార్డు స్థాయికి చేరాయి. డిసెంబర్ 30, 31 తేదీల్లో సుమారు రూ.17 కోట్ల విలువైన మద్యం అమ్ముడైనట్లు ఎక్సైజ్ అధికారులు గురువారం తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే రూ.2 కోట్లు అధిక ఆదాయం లభించింది. మొత్తం విక్రయాల్లో 30 శాతం బీర్ల వాటా ఉండటం విశేషం.