W.G: భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు తన సిబ్బందితో శాసనమండలి ఛైర్మన్ కొయ్యే మోషెన్ రాజును ఆయన నివాసంలో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మోషన్ రాజు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పోలీసులు ప్రజలకు అందిస్తున్న సేవాలను కొనియాడారు. అనంతరం వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టూ టౌన్ సీఐ కాళీ చరణ్, రూరల్ సీఐ శ్రీనివాసరావు, ట్రాఫిక్ సీఐ శ్రీనివాసరావు పాల్గొన్నారు.