VZM: విజయనగరం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు మరిపి విద్యాసాగర్ ఆధ్వర్యంలో గురువారం నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ కార్యకర్తలు, నాయకులతో కలిసి విద్యాసాగర్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ నూతన సంవత్సరంలో ప్రజలందరికీ ఆరోగ్యం, శాంతి, అభివృద్ధి కలగాలని ఆకాంక్షించారు.