W.G: తణుకు మండలం తేతలి హైవేపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందారు. వేల్పూరుకు చెందిన అందే లోకేశ్వరరావు, అందే వెంకటలక్ష్మి (48) దంపతులు తాడేపల్లిగూడెం వైపు నుంచి తణుకు వైపు మోటార్ సైకిల్ పై వస్తుండగా వెనుక నుంచి లారీ ఢీ కొట్టింది. వెంకటలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందగా తీవ్ర గాయాల పాలైన లోకేశ్వరరావును ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.