AP: రాష్ట్రంలో 67.20 లక్షల మంది తల్లులకు తల్లికి వందనం అందిస్తున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. తల్లికి వందనం పథకం కోసం రూ.10,090 కోట్లు విడుదల చేశామని చెప్పారు. నెల్లూరు జిల్లాలో 3.74 లక్షల మంది విద్యార్థుల తల్లులకు తల్లికి వందనం అందుతుందని వెల్లడించారు. కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ లబ్ధి పొందుతున్నారని పేర్కొన్నారు.