E.G: కొవ్వూరు మండలం వేములూరు జడ్పీ హైస్కూల్ ఇంగ్లీష్ టీచర్ ఉబా నాగేశ్వరరావు పదవీ విరమణ సందర్భంగా అభినందన సభ నిర్వహించారు. ఆయన సేవలు ఎంతో అభినందనీయమని వక్తలు కొనియాడారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు దంపతులను గ్రామస్థులు, ఉపాధ్యాయులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా TDP కార్యదర్శి మర్పట్ల కళాధర చక్రవర్తి, తదితరులు పాల్గొన్నారు.