WGL: నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని గీసుగొండ సీఐ విశ్వేశ్వర్ హెచ్చరించారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. మండలంలో డీజేలు పెట్టడం, ఇతరులకు ఇబ్బంది కలిగించే ప్రవర్తన నిషేధమని స్పష్టం చేశారు. మత్తుపానీయాలు, డ్రగ్స్ సేవించరాదని, మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.