MKD: గతంలో కురిసిన భారీ వర్షాలకు నిజాంపేట్ మండలం నందిగామ వద్ద బ్రిడ్జి కృంగి మూడు నెలలు గడుస్తున్నా నేటికీ మరమ్మతులకు మోక్షం లభించలేదు. ఇటీవల మంత్రి దామోదర్ రాజనర్సింహ, కలెక్టర్ రాహుల్ రాజ్ సందర్శించి పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చినా ఆచరణలో అమలు కాలేదని స్థానికులు పేర్కొన్నారు. దీంతో రామాయంపేట – సిద్దిపేట మధ్య రాకపోకలు సాగించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.