ములుగు మున్సిపాలిటీలోని 20 వార్డుల ఓటర్ల వివరాలను మున్సిపల్ కమిషనర్ జనగాం సంపత్ రెడ్డి ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనవరి 5వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణ ఉంటుందని, అదే రోజు రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకుంటామన్నారు. కలెక్టర్ అనుమతితో జనవరి 10వ తేదీన తుది ఓటరు జాబితాను వెల్లడిస్తామని పేర్కొన్నారు.