MDK: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా 2025 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ రెండు రోజుల్లో జిల్లాలో రూ.21.32 కోట్ల విలువైన మద్యం వినియోగించారు. డిసెంబర్ 30, 31 తేదీల్లో రెండు రోజుల్లో చిన్నఘనపూర్ ఐఎంఎల్ డీపో నుంచి వైన్స్ వ్యాపారులు భారీగా మద్యం కొనుగోలు చేశారు. అలాగే డిసెంబర్ నెల మొత్తం జిల్లాలో రూ.209 కోట్ల 50 లక్షల విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్లు సమాచారం.