JGL: ధర్మపురి క్షేత్రంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో గురువారం భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. ఆంగ్ల నూతన సంవత్సరం సందర్బంగా స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సంవత్సరం శుభం జరగాలని, భక్తులు,విద్యార్థులు కోరుతూ స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు.