GNTR: 2026 నూతన సంవత్సరం సందర్భంగా పొన్నూరు మున్సిపల్ కమిషనర్ ముప్పాళ్ల రమేష్ బాబు జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియాను మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజాప్రయోజన కార్యక్రమాల అమలుపై చర్చించారు. జిల్లా అభివృద్ధి, పట్టణ పరిపాలనలో సమన్వయంతో పనిచేయాలని ఇరు అధికారులు అభిప్రాయపడ్డారు.