MBNR: నగర పురపాలక న్యూ ప్రేమ్‌నగర్ వార్డు మాజీ కౌన్సిలర్ కిషోర్ తిరిగి తన సొంత గూటికి చేరుకున్నారు. గతంలో బీఆర్ఎస్లో కొనసాగిన కిషోర్, రెండు సంవత్సరాల క్రితం BJPలో చేరారు. అయితే గురువారం మాజీ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో మళ్లీ బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. BRS ద్వారానే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని అన్నారు.