JN: పాలకుర్తి MLA యశస్విని రెడ్డి,TPCC ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమే మాట్లాడుతూ.. నూతన సంవత్సరం ప్రజల జీవితాల్లో కొత్త ఆశలు, ఆశయాలు, అభివృద్ధి అవకాశాలను తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ఎప్పటికీ తమ ద్వారాలు తెరిచి ఉంటాయని అన్నారు.