నెల్లూరు జిల్లాలో 2025లో నమోదైన పోక్సో, రేప్, హత్య తదితర కేసుల్లో కోర్టులు కఠిన తీర్పులు వెలువరించాయి. మొత్తం 25 మందికి జైలుశిక్ష విధించగా, వీరిలో 13 మందికి యావజ్జీవ కారాగార శిక్ష, ఒకరికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, నలుగురికి 10 ఏళ్ల జైలు శిక్ష పడింది. మరో ఏడుగురికి 5 నుంచి 10 ఏళ్ల మధ్య జైలు శిక్ష విధించారు.