W.G: పాలకొల్లులో ఉన్న శ్రీ అష్టభుజ లక్ష్మీనారాయణస్వామి వారి దేవస్థానంలో ధనుర్మాస మహోత్సవములు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇవాళ స్వామివారిని ‘మత్స్యనారాయుణుడిగా’ ఆలయ అర్చకుడు శ్రీకరి పవన్ ప్రత్యేక అలంకరణ చేసి పూజలు చేశారు. అనంతరం శ్రీ మాన్ రంగనాథస్వామి తిరుప్పావై ప్రవచనం వినిపించారు. నూతన సంవత్సరం కావడంతో భక్తులు పెద్దఎత్తున స్వామివారిని దర్శించుకున్నారు.