SKLM: కోటబొమ్మలి మండలం నిమ్మడలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్ మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ , జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఎస్పీ మహేశ్వర్ రెడ్డి కేంద్ర రాష్ట్ర మంత్రులను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.