జమ్ముకశ్మీర్‌లోని పూంఛ్ సెక్టార్లో పాకిస్థాన్ డ్రోన్ కలకలం రేపింది. నియంత్రణ రేఖ(LoC) వెంబడి భారత గగనతలంలోకి చొరబడిన ఈ డ్రోన్.. ఐఈడీలు, మాదకద్రవ్యాలను జారవిడిచినట్లు అధికారులు గుర్తించారు. సుమారు 5 నిమిషాల పాటు ఇది భారత గగనతలంలోనే చక్కర్లు కొట్టింది. ఈ ఘటనతో అప్రమత్తమైన భద్రతా దళాలు.. ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి.