HNK: జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. ఇవాళ కలెక్టరేట్లో జరిగిన సమీక్షలో పరకాల, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల్లో 2002 జాబితాను 2025తో మ్యాపింగ్ చేయాలని సూచించారు. BLOలు ప్రతి పోలింగ్ కేంద్రం వారీగా తనిఖీలు చేపట్టి తప్పులు లేని జాబితా రూపొందించాలని ఆదేశించారు.