JN: జిల్లాకు చెందిన విద్యార్థి జర్మనీలో మృతి చెందాడు. చిల్పూర్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన హృతిక్ రెడ్డి ఉన్నత చదువుల కోసం జర్మనీ వెళ్ళాడు. ఈ క్రమంలో తాను ఉంటున్న భవనంలో నిన్న అగ్నిప్రమాదం జరిగింది. దీంతో భవనం పై నుంచి కిందికి దూకగా తలకు తీవ్ర గాయమైనట్లు సమాచారం. ఈ క్రమంలో అతడు ప్రాణాలు కోల్పోయాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.